ప్రజల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పై అవగాహన ర్యాలీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ “స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా” అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా శనివారం మెప్మా సిబ్బంది , స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు స్వచ్ఛ భారత్ మిషన్ గురించి తెలియచెప్పడానికి ఉదయం 9 గంటలకు మునిసిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షకీలా దస్తగిరి, మునిసిపల్ కమీషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్, 8వ వార్డ్ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య ,మెప్మా సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యలు, రోటరీ క్లబ్ సభ్యులు,వాసవి వనిత క్లబ్ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం సభ్యులు, ఆర్.ఎస్.ఎస్ సభ్యులు, కస్తూరిబా విద్యాభవన్ విద్యార్థులు , మునిసిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. (Story : ప్రజల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పై అవగాహన ర్యాలీ)