ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
న్యూస్‌తెలుగు/ కొమురం భీం /ఆసిఫాబాద్ జిల్లా : ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థి దశ నుండి అవగాహన కలిగి ఉండాలని హెచ్ఐవి నియంత్రణకై కృషి చేయాలని ఐసిటిసి కోఆర్డినేటర్ హరీశ్ రావ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధ్యార్థులకు హెచ్ఐవి నియంత్రణపై ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ప్రకాష్ నేతృత్వంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ జయంతి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌమారదశ లో విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు లైంగిక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి, హెచ్.ఐ.వి. నివారణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్, యాదగిరి, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి)