Home వార్తలు తెలంగాణ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి

0

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి

జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్

న్యూస్ తెలుగు /ములుగు : ఇందిరా మహిళా శక్తి లబ్ధిదారులు ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మదర్ యూనిట్, పెరటి కోళ్ళ పెంపకము పై లబ్ది దారులకు, సిబ్బందికి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తగిన ఉపాధి మార్గాల కోసం జిల్లాలో 9 మదర్ యూనిట్లను, ఒకొక్క యూనిట్ విలువ రూ.2.91 లక్షలు, పెరటి కోళ్ల యూనిట్లు 1125,యూనిట్ విలువ రూ. 15 వేలు ఎంపిక చేసినట్లు తెలిపారు. లబ్ధి పొందిన మహిళా సంఘాలు వంద శాతం ప్రగతి సాధించాలని అన్నారు. బ్యాంక్ లింకేజి క్రింద తీసుకున్న రుణాలను వంద శాతం రికవరీ చేయాలని సీసీ లను ఆదేశించారు.మహిళా శక్తి కార్యక్రమాల్లో ములుగు జిల్లా ముందుండాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ సమావేశంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బాలస్వామి, జిల్లా పశు వైద్యాధికారి కొమురయ్య, ఏ పి ఎం లు,సి సి లు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.(Story:ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలిజిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version