Home వార్తలు తెలంగాణ ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

0

ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

కాంగ్రెస్, టిఆర్ఎస్, సీ.పి.ఐ, తెలుగుదేశం, బీఎస్పీ, బీసీ, ఎస్సీ సంఘం నాయకులు

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి ప్రజల గొంతుక గా ఉన్న మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులతోపాటు కాంగ్రెస్, బి,ఆర్,ఎస్ తెలుగుదేశం, సిపిఐ, బి.ఎస్పి, బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వనపర్తి లో ప్రతిపక్ష పాత్ర లేకుండా ఉన్న సమయంలో అన్ని పార్టీల నుండి ధైర్యస్థలను కూడగట్టుకుని అవినీతి, అక్రమార్కులపై పలు సాక్షాలతో బయటపెడుతూ ప్రజల అవసరాలను గుర్తు చేస్తూ వనపర్తి జిల్లా ప్రజలకు ఒకడు ఉన్నాడని గుర్తు చేస్తూ ఎక్కడా పట్టు విడవకుండా ప్రజలకు మేలు చేస్తున్న సతీష్ యాదవ్ జన్మదినాన్ని జరపడం ఆయనకు ఒక నూలుపోవు ఇచ్చినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు గోపాలకృష్ణ, రమేష్, తెలుగుదేశం నాయకులు కొత్త గొల్ల శంకర్, మధు, బిఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు చందు యాదవ్, అశోక్, సాయి, నాయకులు బల్మూరి భాస్కర్, మరియు సతీష్ యాదవ్ స్నేహితులు పాల్గొన్నారు. (Story : ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version