ఆకట్టుకున్న టెడ్డీబేర్ డే ప్రదర్శన
జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హెడ్మాస్టర్ మాలిని
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు-జీవానంద ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో టెడ్డీబేర్ డే ప్రదర్శన అందరిని ఆకట్టుకోవడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ మాలిని, కరెస్పాండెంట్ శ్రీకాంత్, సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలోని ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారుల చేత వేషధారణను వేయించడం జరిగిందని తెలిపారు. వేష ధారణలో మానస, భాను సైనిక, తనుశ్రీ, లాస్య రెడ్డి, దివ్యశ్రీ, పూజ, జాగృతి, కార్తీక్ కలరని తెలిపారు. అనంతరం యొక్క ప్రదర్శన ప్రేయర్ సమయంలో నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు లను ముగ్ధుల్ని చేశాయని తెలిపారు. తదుపరి టెడ్డీబేర్ దినోత్సవం గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story: ఆకట్టుకున్న టెడ్డీబేర్ డే ప్రదర్శన.)