Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలి

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలి

0

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలి

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి మంజునాథ్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలని ఆసుపత్రి సిబ్బంది మన్నెమ్మ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి మంజునాథ్, ఉప కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి వారు మాట్లాడుతూ గర్భవతులు వైద్యుల సలహాలను పాటిస్తూ, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన జీవనం చేయాలని తెలిపారు. ఆందోళనకు గురి అయితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లోనే ప్రసవం చేసుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పుట్టినప్పటినుంచి ఆరు నెలల వరకు జన్మించిన బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ గర్భిణీలు, బాలింతల పట్ల వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. నేటి ఈ పండ్ల పంపిణీ కార్యక్రమానికి దాతగా మానవతా సంస్థ నిర్వహించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మనోహర్ గుప్తా, సాయి ప్రసాద్, నారాయణరెడ్డి, నాగరాజు, జింక చిన్నప్ప పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version