Home టాప్‌స్టోరీ జానీ మాస్టర్‌ గోవాలో అరెస్ట్‌

జానీ మాస్టర్‌ గోవాలో అరెస్ట్‌

0

జానీ మాస్టర్‌ గోవాలో అరెస్ట్‌

బెంగళూరు: కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ గోవాలో అరెస్ట్‌ అయ్యాడు. కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ను సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) బుధవారం నాడు అత్యాచారం కేసులో అరెస్టు చేసింది. జానీ మాస్టర్‌పై లైంగిక నేరాలు, పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను ఒక రోజు తర్వాత, సెప్టెంబర్‌ 19, గురువారం నాడు ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి జానీ మాస్టర్‌
బుధవారం సాయంత్రం నుంచే కనబడటం లేదు. అతను తన నివాసం నుండి తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని ఫోన్‌ కూడా అందుబాటులో లేదు. 24 గంటల అన్వేషణ అనంతరం గురువారం ఉదయం పోలీసులు గోవాలో అరెస్టు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు గురిచేశారని, అత్యాచారానికి పాల్పడ్డాడని, అనేక సందర్భాల్లో బెదిరింపులకు పాల్పడినట్లు 21 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ముంబై, హైదరాబాద్‌, చెన్నై సహా పలు నగరాల్లో ఔట్‌డోర్‌ సినిమా షూటింగుల్లో తనను వేధించేవాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అతనిపై ఐపిసి 376,506, 323 (2) సెక్షన్ల కింద అత్యాచారం, క్రిమినల్‌ బెదిరింపులు, గాయపరిచినందుకు కేసు నమోదు చేశారు.

లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ విచారణ

అంతకుముందు, అంటే మంగళవారం, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పదవి నుండి జానీ మాస్టర్‌ను తొలగించింది. ఐదేళ్ల క్రితం 16 ఏళ్ల వయస్సు గల మైనర్‌ డ్యాన్సర్‌ను ఎలా నియమించుకున్నాడో దర్యాప్తు చేయడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు, లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసింది. పోలీసు విచారణకు సమాంతరంగా నివేదికను సిద్ధం చేసే ప్రక్రియలో ఉంది. 90 రోజుల గడువులోపు నివేదికను సమర్పిస్తామని ప్యానెల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న నటి రaాన్సీ తెలిపారు. ఇదిలావుండగా, బాధితురాలు ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్‌ సంరక్షణలో ఉంది. జానీ మాస్టర్‌పై కేసు నమోదుకాగానే, జనసేన పార్టీ అతన్ని సస్పెండ్‌ చేసింది. జానీ మాస్టర్‌ జనసేన పార్టీలో కీలక భూమిక నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెంటనే అతన్ని సస్పెండ్‌ చేశారు. (Story: జానీ మాస్టర్‌ గోవాలో అరెస్ట్‌)

The News in YouTube

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version