విస్తరణ దిశగా ట్రేడ్‌బ్రిడ్జ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ట్రేడ్‌బ్రిడ్జ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు అనగా డ్రై ఫ్రూట్స్/ మసాలా సమల్లు మొదలైన వాటికి ఒక అగ్ర వ్యవసాయ టెక్నాలజీ వేదిక. హైదరాబాద్‌లో దీని వాడకం ఎక్కువగా జరుగుతూ ఉండడంతో విస్తరించడం ప్రారంభించింది. మొత్తం తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సుమారు 4500 మంది కొనుగోలుదారులు ఉన్నారు. కొనుగోలుదారులను రైతులు, ప్రాసెసర్లతో నిరాటంకంగా కనెక్ట్ చేయగల ప్లాట్‌ఫామ్ సామర్థ్యం ఈ వేగవంతమైన వృద్ధికి దారితీసింది. ఇది హైదరాబాద్ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో వాటాదారులకు ఇష్టమైన ఎంపికగా మారింది. హైదరాబాద్‌లో విస్తరిస్తూ ఉన్న వ్యాసాయ విభాగం టెక్నాలజీ వాడుక పెరగుదలతో ట్రేడ్ బ్రిడ్జ్ విస్తరణ కిమంచి స్థానంగా నిలిచింది. ప్లాట్‌ఫామ్ వినియోగదారులకి సులువుగా అర్ధం అయ్యే ఇంటర్ఫేస్. ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ సమాచారం, సురక్షితమైన లావాదేవీల సమర్ధ్యాలు ట్రేడ్ ప్రొఫెషనల్స్‌తో బలంగా ప్రతిధ్వనించాయి. తాజాగా ట్రేడ్‌బ్రిడ్జ్ అత్యంత నమ్మకమైన వస్తువుల డెలివరీలో పెట్టుబడి పెట్టాలి అనే నిబడ్డతతో ఉంది. దానితో పాటు ట్రేడ్ బ్రిడ్జ్ వారికి అనువుగా ఉన్న డేట్లలో డెలివరీ వచ్చే విధంగా వినియోగదారులు ఆర్డర్‌లను పెట్టుకునే విధంగా ఆమోదిస్తుంది. (Story : విస్తరణ దిశగా ట్రేడ్‌బ్రిడ్జ్ )