గ్రాసియాను వినియోగించిన 98% మిరప రైతులు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: మిరప పంటల కోసం 98% మిరప రైతులు గ్రాసియాను ఉపయోగించారని, ఇది మిరప పంటలకు సమర్థవంతమైన చీడ పీడల నివారిణి అని గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) వెల్లడిరచింది. దక్షిణాదిలోని మిరప మార్కెట్‌లలో నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేస్తూ, 57% మంది రైతులు 15-35 రోజులు మధ్య గ్రాసియాను ఉపయోగించారని కంపెనీ వెల్లడిరచింది. ‘‘మిరప పంటలో 15-25 రోజుల దశలో గ్రాసియా ను పిచికారీ చేస్తే తామర పురుగు (త్రిప్స్) నుంచి దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది, రైతులు గ్రాసియాను ముందుగానే ఉపయోగించడంలో విలువను కనుగొంటున్నట్లు పరిశోధనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అదనంగా, మేము సర్వే చేసిన రైతులులో 71% మంది గత సంవత్సరం 2 సార్లు కంటే ఎక్కువగా గోద్రెజ్ అగ్రోవెట్ వారి గ్రాసియాను ఉపయోగించారు. గ్రాసియా అనేది రైతులకు అత్యంత ప్రజాదరణ పొందిన, గో-టు-బ్రాండ్‌గా ఇది పునరుద్ఘాటిస్తుంది’’ అని గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్.కె అన్నారు. (Story : గ్రాసియాను వినియోగించిన 98% మిరప రైతులు)