ఘనంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం వేడుకలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని పూజారి స్వగృహంలో అనంతపద్మనాభస్వామి వ్రతమును ఆర్య వైశ్యులు, భక్తాదులు, దంపతులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అనంతపద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహానికి వివిధ పూజలతో పాటు ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని వివిధ పూలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. గణపతి పూజ, యమునా పూజ లతోపాటు అనంత పద్మనాభ స్వామి వ్రతం వ్రతం యొక్క కథను కూడా అర్చకులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ, ఆర్యవైశ్య యువజన, ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి, వివిధ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన అనంత పద్మనాభ స్వామి వ్రతం వేడుకలు)