సెప్టెంబర్ 27 నుండి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
న్యూస్‌తెలుగు/బెంగళూరు: భారతదేశంలో అత్యంతగా ఎదురుచూస్తున్న పండగ, ‘అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజిఐఎఫ్), సెప్టెంబర్ 27 2024 నుండి ప్రారంభమవుతుంది, ప్రైమ్ సభ్యులకు ఇది 24 గంటల ముందుగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపికపై భారతదేశపు ప్రాధాన్యతనివ్వబడిన, నమ్మకమైన ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశంపై వేగవంతమైన, నమ్మకమైన సౌకర్యంతో ఆకర్షణీయమైన డీల్స్‌ను గొప్ప విలువకు ఆనందించవచ్చునని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – కేటగిరీస్ సౌరభ్ శ్రీవాస్తవ అన్నారు. కస్టమర్లు స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్, బ్యూటీ, పెద్ద ఉపకరణాలు, టీవీలు, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, కిరాణా, ప్రముఖ బ్రాండ్స్ నుండి మరెన్నో వాటితో సహా కొత్త విడుదలలు, ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందుతారన్నారు. అదనంగా, వారు ఎస్ బిఐ డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ ఈఎంఐతో 10% తక్షణ డిస్కౌంట్ పొందగలరు. ప్రైమ్ సభ్యులు తమ అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినప్పుడు షాపింగ్‌పై 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్‌ను ఆనందించవచ్చు. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐతో స్మార్ట్ కొనుగోళ్లను కూడా వారు చేయవచ్చు. (Story : సెప్టెంబర్ 27 నుండి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్)