జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మనవరాలు నామకరణం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మనవరాలు నామకరణ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, హిందూపూర్ పార్లమెంటు సభ్యులు పార్థసారథి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కుమార్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొని నామకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనవరాలికి ఈశా బైరా రెడ్డి అని నామకరణం చేయగా మంత్రులందరూ కూడా తమ ఆశీస్సులను అందజేశారు. చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా మనవరాలి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మనవరాలు నామకరణం)