డిపో అభివృద్ధికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
ఎంప్లాయిస్ యూనియన్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం ఆర్టీసీ డిపో అభివృద్ధికి తో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం డిపో నాయకులు మాట్లాడుతూ గతంలో ధర్మారం డిపోలో 85 సర్వీసులు ఉండేవని అయితే చాలా సర్వీసులు రద్దు పరచడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేయబోయే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకమునకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండుటకు డిపో పరిధిలో మరిన్ని కొత్త సర్వీస్ లను పెంచాలని తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ ఇష్టానుసారంగా శిక్షలు అమలు చేయడం వలన ప్రతి ఉద్యోగి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. మరోపక్క ఉద్యోగులకు పనిభారం పెరగడంతో 90 శాతం మందికి బీపీ, షుగర్, వెన్నెముక నొప్పి తదితర వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. డిపోలో ఉన్న ఓటి డ్యూటీలను మరిన్ని తదితర డ్యూటీలుగా పెంచుటకు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ త్వరలో మీ సమస్యలు పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం:: ఎన్ఎంయు ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పల్లె వెలుగు సర్వీసులను తిరిగి పునరుద్దించాలని, ధర్మారం నుండి విజయవాడ, నెల్లూరు, ఒంగోలు సర్వీసులు కేటాయించాలని, పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన ఆరు డిపోలకు హిందూపూర్ లో ఆసుపత్రి ఉన్నదని, ఉద్యోగులు అక్కడికి వెళ్లి వైద్య చికిత్సలు పొందాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అలాగాకుండా అనంతపురం ఆసుపత్రిలో చికిత్స చేయించుకొనుటకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు, అదేవిధంగా త్రాగునీటి ను కూడా ప్రయాణికులకు డిపో మేనేజర్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. గ్యారేజీలో నూతన షెడ్డు కూడా నిర్మించాలని తెలిపారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ నాయకులు పాల్గొన్నారు. (Story : డిపో అభివృద్ధికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి)