ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్
న్యూస్ తెలుగు /ములుగు : ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. సెప్టెంబర్ 17 తేదీ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జరగనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్17 వ తేదీ ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణం లో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని , గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిషరించాలని సూచించారు.
ప్రజా పాలన దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా జరుగనున్న కార్యక్రమాల వివరాలు
ఉదయం 9.45 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి జిల్లా ఎస్పి చేరుకుంటారన్నారు.
ఉదయం 9.50 నిమిషాలకు కార్యాలయానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చేరుకుంటారు.
ఉదయం 9.55 నిమిషాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేరుకుంటారని తెలిపారు.
ఉదయం 10.00 గంటలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తారని పేర్కొన్నారు.
ఉదయం 10.10 నిమిషాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు.
ఉదయం10.15 నిమిషాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కగారు ప్రజా పాలన దినోత్సవం గురించి ప్రసంగిస్తారు.
ఈ వేడుకలకు అధికారులు , ప్రజలు, విద్యార్దులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు (Story : ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు)