గంజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పాత మార్కెట్ గంజ్ లో ఉన్నశ్రీ లక్ష్మి గణపతి ఆలయానికి విచ్చేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , 23వ వార్డులో ఉన్న గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వనపర్తి పట్టణంలో,ఆర్. జీ గార్డెన్ నందు జనుంపల్లి బీచుపల్లి యాదవ్ (బీ ఆర్ యస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వారి కుమార్తె , కుమారుల పుట్టు చీర, పుట్టు పంచే కార్యక్రమానికి హాజరై చిన్నారులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, స్టార్ రైమ్, కంచే రవి, నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, జాత్రు నాయక్, ఎర్ర శ్రీను, బలిజపల్లి శశి వర్ధన్ రెడ్డి, దొడ్ల రాములు, మహేశ్వర్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, గులాం ఖాదర్ ఖాన్ , మాజీ సర్పంచ్ గౌడ నాయక్, సూర్య వంశం గిరి, మాధవ రావు సునీల్ వాల్మీకి, జోహెబ్ హుసేన్ , చిట్యాల రాము, యుగంధర్ రెడ్డి, మంద రాము,అరిఫ్ పాషా, ఏ కే పాషా, దానియేలు ,ముద్దు ఫిర్, పజల్, ఖలీల్ , పుష్పక్ యాదవ్, బంగాలి రఘు, J.కార్తిక్, నరేందర్ రెడ్డి, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : గంజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు )