యుటిఎఫ్ స్వర్ణోత్సవ జిల్లా స్థాయి మహిళా క్రీడా పోటీలు విజయవంతం.
బోధన తో బాటు ఉపాధ్యాయులకు క్రీడలు ఎంతో ముఖ్యం – రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు.
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ 50వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా యుటిఎఫ్ జిల్లా స్థాయి మహిళా టీచర్స్ క్రీడా పోటీలను కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో త్రోబాల్, టెన్నీ కాయిట్ , షాట్ పుట్, షటిల్, స్పీడ్ వాక్ పోటీలను యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సత్య సాయి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి , ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ , యూటీఎఫ్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు తహీర్ వలి, సుబ్బా రెడ్డి, నరేష్ కుమార్, సీనియర్ నాయకులు నారాయణస్వామి, కదిరి జోన్ యుటిఎఫ్ నాయకత్వం ..వీరు మాట్లాడుతూ యూ. టి. ఎఫ్. అధ్యయనం, ఆధ్యాపనం, సామజిక స్పృహ అనే సిద్ధాంతాలతో పని చేస్తూ, ఉపాధ్యాయ హక్కుల కోసమే కాకుండా, సామజిక సేవలలో కూడా అగ్రగామిగా ముంటుందని వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మహిళా టీచర్స్ 279 మంది వరకూ పాల్గొనడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.రాష్ట్ర అధ్యక్షులు, నక్కా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడాపోటీలలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం వల్ల ఒత్తిడి లేని బోధనను కొనసాగించుటకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, అదేవిధంగా ప్రభుత్వ బడులలో పేద పిల్లలకు బోధనలో గుణాత్మక విద్యను అందించాలని, అదేవిదంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసే విదంగా మహిళా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం క్రీడా పోటీలలో గెలుపొందిన విన్నర్, రన్నర్లకు రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కోశాధికారి శ్రీనివాసులు, తహీర్ వలి, సుబ్బా రెడ్డి, నరేష్ కుమార్ నారాయణ స్వామి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు.(Story:యుటిఎఫ్ స్వర్ణోత్సవ జిల్లా స్థాయి మహిళా క్రీడా పోటీలు విజయవంతం.)