Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చేనేత పరిశ్రమను కాపాడండి

చేనేత పరిశ్రమను కాపాడండి

0

చేనేత పరిశ్రమను కాపాడండి

ఎ పి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి

కళ్ళు ఉన్న కబోదిగా అవలంబిస్తున్న చేనేత జౌళి శాఖ మంత్రి సవిత

సిపిఐ నియోజకవర్గం ముసుగు మధు

ఈనెల 18న ఆర్డీవో కార్యాలయం ధర్నా

25న జేఆర్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  చేనేత పరిశ్రమను కాపాడాలని, కళ్ళు ఉన్న కబోదిగా అవలంబిస్తున్న చేనేత జౌలీ శాఖ మంత్రి సవిత తీరు మారాలని, ఇందుకు నిరసనగా చేనేత పరిశ్రమను కాపాడుకునేందుకు, చేనేత కార్మికుల జీవన విధానం మరింత మెరుగుపడేందుకు ఈనెల 18వ తేదీన ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నాను, అదేవిధంగా ఈనెల 25న నాగులూరు లోని జేఆర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక చలపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రహ్మంగారి గుడిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత 11 రకాల రిజర్వేషన్ల నిబంధనలకు విరుద్ధంగా ప్యూర్ చీరలు తయారు చేస్తూ, చేనేత పరిశ్రమనే చిన్నాభిన్నం చేస్తున్నా రని మండిపడ్డారు. ధర్మవరం చేనేత పరిశ్రమకు నేనే రారాజుగా వెలుగొందాలనుకుని జెట్లూమ్స్ ఏర్పాటు చేసి, దిగువ మధ్యతరగతి నేతన్నల కళ్ళు పొడిచి పొట్ట కొడుతున్నారు అని తెలిపారు. జే ఆర్ ఫ్యాక్టరీ యజమాని జింక రామాంజనేయులు నిర్వాకం వల్ల పనులు లేక, ఉన్న గిట్టుబాటు లేక బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి చేనేత పరిశ్రమలో ఏర్పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ లూమ్స్ దాటికి తట్టుకోలేక ధర్మవరం చేనేత పరిశ్రమ కకా వికలమై పోతుందనడం లో ఎటువంటి సందేహం లేదు అని తెలిపారు.భారీ ఎత్తున సబ్సిడీపై పరిశ్రమను ఏర్పాటు చేసి, దాదాపు 200 పైగా జెట్లూమ్స్ ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క లూ మ్స్ నుంచి రోజుకు 3 నుంచి 4 చీరలు తయారు చేస్తూ, అలా 200 ల్యూమ్స్ ద్వారా రోజుకు 600 నుంచి 800 ప్యూర్ టు ప్యూర్ చీరలు తయారు చేస్తూ అక్రమార్చనకు వడిగట్టే పరిస్థితి ఏర్పడుతోంది అని తెలిపారు. తద్వారా నెలకు కోట్లాది రూపాయలు నిబంధన విరుద్ధంగా ఆర్జిస్తూ, పరిశ్రమ మనుగడకే ప్రశ్నార్ధకంగా మారింది అన్నారు. విచారణ నిమిత్తం వచ్చే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఫ్యాక్టరీ లోకి ప్రవేశించగానే కళ్ళు మూసుకుపోతాయో.. ఏమో.. తెలియదు కానీ అంతా సవ్యంగా నడుస్తోందని క్లీన్ చిట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ క్లీన్ చిట్ వెనక భారీ ఎత్తున ముడుపులు కూడా అందినట్లు సమాచారం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. ఇప్పటికైనా హ్యాండ్లూమ్ అధికారులు, మంత్రి సవిత, ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దన్న, సిఐటియు నియోజకవర్గ కార్యదర్శి ఆది, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, పి ఎస్ యు జిల్లా అధ్యక్షులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version