సొంత విభాగానికి విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకం
రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రెండు భాగాలుగా చీలిన ఎక్సైజ్ డిపార్ట్మెంటును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుండి సొంత డిపార్ట్మెంట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిన మా డిపార్ట్మెంటునుకు అంతా ఒకటిగా చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర కు ప్రత్యేకతలను ఎక్సైజ్ సీఐ గురు ప్రసాద్, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకము నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇకనుంచి మా ప్రభుత్వ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో, అకుంఠిత దీక్షతో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు (Story : సొంత విభాగానికి విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకం)