Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినాయక నిమజ్జనం ఎలా జరుపుకోవాలి

వినాయక నిమజ్జనం ఎలా జరుపుకోవాలి

0

వినాయక నిమజ్జనం ఎలా జరుపుకోవాలి

పండుగలలో ఎంతో విశిష్టమైనది ..చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంత భక్తితో జరుపుకునే పండుగ వినాయక చవితి పండుగ . ప్రకృతితో మమేకమై ఉంటుంది.  అందువల్లనే మట్టి వినాయకుని పత్రితో పూజిస్తాం . తరువాత విగ్రహాన్ని చెరువులలో కానీ,  నదులలో కానీ నిమజ్జనం చేస్తాం . ఇక్కడి వరకు బాగున్నా నిమజ్జనం దగ్గరే అసలు సమస్య ఉంది. అది ఏమిటంటే..

1.తొమ్మిది రోజులు పూజించిన గణపతిని నిమజ్జనం రోజు భారీ ఎత్తున ఖర్చుతో నిమజ్జనం చేస్తాం.

2. విగ్రహానికి ముందు పెద్ద పెద్ద శబ్దాలతో డీజే ఏర్పాటు చేస్తారు. మంచిదే కానీ ఆ స్పీకర్స్ నుండి వచ్చే పాటలు అన్నీ బూతు పాటలు డబుల్ మీనింగ్ పాటలు.

3. ఇక స్వామి విగ్రహాన్ని ఊరేగిస్తూ స్వామివారి ముందు డాన్సులు చేస్తారు అవి రికార్డింగ్ డాన్సులు కన్నా గోరంగా ఉంటాయి. వీటిని మహిళలు, చిన్నపిల్లలు చూస్తారు అని ఆలోచించరు.

4. కొందరు వినాయక చవితి పందిళ్ళ ముందు సినిమా పాటలు పెడతారు అసలు వినాయక చవితి పందిళ్ళ నందు చక్కటి పాత భక్తి పాటలు పెడితే మనలో దైవం మీద భక్తి కలుగుతుంది కానీ ఈ సినిమా పాటల వల్ల భక్తి కన్నా సినిమా పాటే గుర్తుకు వస్తుంది.

5. వినాయక నిమజ్జనం ముందు చక్కగా ఈ పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే పాటల కన్నా… ఏవైనా చెక్కభజనలు కోలాటాలతో ఊరేగింపు ఉంటే బాగుంటుంది.

6. అలాగే పందిరిలో రోజు కనీసం 10 మంది అయినా కూర్చోండి ఆ సమయంలో పిచ్చి పాటలు పెట్టక భక్తి పాటలు పెట్టండి. వినాయక పందిరిలో సెల్ ఫోన్స్ చూడక భక్తి భావంతో ఉండండి.

7. నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.

8. చిన్నపిల్లలను నిమజ్జనం జరిగే ప్రదేశానికి తీసుకొని వెళ్లకండి. జీవితం ప్రాణం విలువైనది. ఏదైనా ప్రమాదాలు జరిగిన కుటుంబం బాధపడవలసి వస్తుంది. (Story : వినాయక నిమజ్జనం ఎలా జరుపుకోవాలి)
                                                                                       ( విష్ణు బోట్ల రామకృష్ణ) 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version