Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సాయి జూనియర్ కళాశాల గణనాథుల ఊరేగింపు.

అంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సాయి జూనియర్ కళాశాల గణనాథుల ఊరేగింపు.

అంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సాయి జూనియర్ కళాశాల గణనాథుల ఊరేగింపు

న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ విశ్వ సాయి జూనియర్ కళాశాలలో వినాయక ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు కోలాటం నృత్యాలతో, భజనలతో ఊరేగింపు మహోత్సవాన్ని చక్కగా నిర్వహించారు. అనంతరం లాయర్స్ స్ట్రీట్ నందు గల విశ్వ సాయి జూనియర్ కాలేజ్ క్యాంపస్ నందు గల వినాయకుడు ఊరేగింపు విద్యార్థులచే విశేషం నృత్యాలతో, భజనలతో కోలాహలంగా జరిగింది. కళాశాలలో వరసిద్ధి వినాయకుని లడ్డూలను వేలంపాట వేయగా బూదాటి రమేష్ 15వేల రూపాయలతో మహా లడ్డు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఈ వినాయక ఉత్సవాల ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారవంతమైనటువంటి ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపాల్ శ్రీవల్లి, పావనీయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. (Story : అంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సాయి జూనియర్ కళాశాల గణనాథుల ఊరేగింపు.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!