Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల

మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల

0

మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల

న్యూస్‌తెలుగు/ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్‌ మీడియా అసిస్టెంట్‌లను ఈ నోటిఫికేషన్‌ కింద నియమించనుంది. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌/తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు విద్యార్హతలు ఏమేం ఉండాలంటే.. బీఈ, బీటెక్‌తోపాటు సోషల్‌ మీడియాపై అవగాహన ఉండాలని నిర్ణయించారు. వీరికి నెలకు రూ.50 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తారు. సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ పోస్టులకి విద్యార్హత.. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీరికి నెలకు రూ.30 వేల చొప్పున జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు లేటెస్ట్ రెజ్యూమేను info.apdcl@gmail.com ఐడీకి ఈమెయిల్ చేయాలి. సెప్టెంబర్‌ 23, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలకు https://www.apdc.ap.gov.in/ , http://ipr.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. (Story : మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version