జోష్ గా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి మైదానంలో ఏడవ రోజు కూడా అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంచి జోష్‌తో కొనసాగాయి.
మొదటి మ్యాచ్ కట్టే కింగ్స్ డిఎంఎం కి ఎలెవన్ లగాన్స్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో కట్టే కింగ్స్ డిఎంఎం టీం మీద ఎలెవన్ లగాన్స్ టీం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
రెండవ మ్యాచ్ ఎగ్ రైస్ పిటిపి టీం కి ఫ్రెండ్ లెవన్ సికె పల్లి టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో ఫ్రెండ్ లెవన్ సికె పల్లి టీం మీద ఎగ్ రైస్ పిటిపి టీం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మూడవ మ్యాచ్ వాల్మీకి 11 ధర్మవరం టీం కి ఉజ్వల్ హిందూపూర్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో వాల్మీకి 11 ధర్మవరం టీం మీద ఉజ్వల్ హిందూపూర్ టీం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
నాలుగవ మ్యాచ్ ఎగ్ రైస్ పిటిపి టీం కి ఎలెవన్ లగాన్స్ టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో ఎలెవన్ లగాన్స్ టీం మీద ఎగ్ రైస్ పిటిపి టీం 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐదవ మ్యాచ్ బసంపల్లి టీం కి ఉజ్వల్ హిందూపూర్ టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో బసంపల్లి టీం మీద ఉజ్వల్ హిందూపూర్ టీం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ ఆరు మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన ఎలెవన్ లగాన్స్ టీం వంశీ, ఎగ్ రైస్ పిటిపి టీం ఇర్ఫాన్ జియో బిటిపి, ఉజ్వల్ హిందూపూర్ టీం రఘు, ఎగ్ రైస్ పిటిపి క్రేజీ బాయ్ అప్పు,ఉజ్వల్ హిందూపూర్ టీం సయ్యద్ అబ్దుల్ రజాక్,
అనే ఐదుగురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్, మంత్రి పిఏ మల్లికార్జున,బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, జింక చంద్ర, సాకే ఓబ్లేస్, నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు. (Story : జోష్ గా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు)