Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రసవత్తరంగా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

రసవత్తరంగా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

0

రసవత్తరంగా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి మైదానంలో ఐదవ రోజు కూడా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి.
మొదటి మ్యాచ్ వాల్మీకి డిఎంఎం కి కట్టే కింగ్స్ డిఎంఎం మధ్య జరిగిన మ్యాచ్లో వాల్మీకి డిఎంఎం టీం మీద కట్టే కింగ్స్ డిఎంఎం టీం నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండవ మ్యాచ్ అనిల్ గొట్లూరు ఎంజి వారియర్స్ డిఎంఎం కి మధ్య జరిగిన మ్యాచ్లో అనిల్ గోట్లూరు టీం మీద ఎంజి వారియర్స్ టీం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడవ మ్యాచ్ ప్రతాప్ 11 టీం కి స్టార్ 11 టీం మధ్య జరిగిన మ్యాచ్లో ప్రతాప్ 11 టీం మీద స్టార్ 11 టీం ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మూడు మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన కట్టే కింగ్స్ టీం వెంకటేష్ కే, ఎంజి వారియర్స్ టీం చిన్న, స్టార్ లెవెన్ టీం షేక్ష అనే ముగ్గురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది హరీష్,బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, జింక చంద్ర, సాకే ఓబ్లేస్ తదితరులు పాల్గొన్నారు. (Story : రసవత్తరంగా శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version