Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

0

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/విజ‌య‌న‌గ‌రం:  ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు నగరంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను సోమవారం స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి గజపతిరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న పెద్ద చెరువు అవుట్ ఫ్లో ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వినాయక నగర్ ప్రాంతాన్ని పరిశీలించారు.తర్యాత పద్మావతి నగర్ ఫస్ట్ లైన్, మజ్జిపేటలో ఇల్లు కూలిపోయిన పరిస్థితిని గమనించారు. అయ్యన్నపేట ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులపై అధికారులను ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్పపీడన ద్రోని ప్రభావంతో గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన కృషిచేసి యథాస్థితికి తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర పరిస్థితుల్లో అందించిన సేవలు మరువరానివని అన్నారు. విజయవాడలో ముంపు ప్రాంతాలను సరి చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందిని కూడా తరలించడం జరిగిందన్నారు. అక్కడ పరిస్థితులను యదా స్థితికి తీసుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారానందించే ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమల రావు, ప్రజారోగ్య అధికారి, డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు మధుసూధనరావు,అమ్మాజీ రావు, డి ఈ అప్పారావు, టిపిఆర్ఓ సింహాచలం, టిడిపి నాయకులు ఐవీపీ రాజు,కనకల మురళీమోహన్, ప్రసాదుల లక్ష్మీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. (Story : ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version