డిజిటల్ సేఫ్టీపై మెటా ‘డిజిటల్ సురక్ష ఫర్ టీన్స్’ రౌండ్‌టేబుల్
హైదరాబాద్: యువత శ్రేయస్సు పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ మెటా సోమవారం హైదరాబాద్‌లో ‘టాకింగ్ డిజిటల్ సురక్ష ఫర్ టీన్స్’ పేరిట రౌండ్‌టేబుల్‌ను నిర్వహించింది. ఆన్‌లైన్ భద్రతపై మెటా యొక్క విధానంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచడానికి మరియు డిజిటల్ ప్రపంచంలో టీనేజ్ శ్రేయస్సును రక్షించడానికి ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి 1%వీ1దీ% భాగస్వామ్యంతో పేరెంట్-ఎడ్యుకేటర్ ఫోరమ్ జరిగింది. నగరంలోని 10-15 ఎంపిక చేసిన పాఠశాలల నుండి ఎంపిక చేసిన విద్యావేత్తలు, తల్లిదండ్రులు డిజిటల్ భద్రతా కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి, వారి టీనేజ్ పిల్లల సోషల్ మీడియా ప్రయాణం అనుభవాలను పంచుకోవడానికి రౌండ్ టేబుల్‌కు హాజరయ్యారు. మెటా తమ యాప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో సమతుల్య అనుభవాన్ని అందించడానికి దాని భద్రత సాధనాలు, ఫీచర్‌ల వివరణాత్మక పరిజానంను అందించింది. (Story : డిజిటల్ సేఫ్టీపై మెటా ‘డిజిటల్ సురక్ష ఫర్ టీన్స్’ రౌండ్‌టేబుల్)
