మెటావిజన్-8ఐని విడుదల చేసిన మెటల్ పవర్ అనలిటికల్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రముఖ భారతీయ విశ్లేషణాత్మక పరికరాల తయారీ సంస్థ, మెటల్ పవర్ ఎనలిటికల్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంపీఏ), సోమవారం తమ తాజా ఉత్పత్తి-మెటా విజన్ -8ఐని విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచింది. ఈ వినూత్న ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ (ఓఈఎస్) సరసమైన ధరలో, నాణ్యత పట్ల స్పృహ కలిగిన, అధిక-పనితీరు గల మౌళిక విశ్లేషణ సామర్థ్యాలతో పెరుగుతున్న భారతీయ లోహ పరిశ్రమకు మెరుగైన ఫలితాలు అందించడానికి రూపొందింది, ఇది ఎంఎస్‌ఎంఈలు కూడా విలువ గొలుసులో దూసుకుపోయేలా చేస్తుంది. సాంప్రదాయకంగా, అధిక-నాణ్యత కలిగిన ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్ (ఓఈఎస్) వ్యవస్థలు చిన్న తయారీదారులకు ఖరీదైనవి, ఇది అధిక-పనితీరు గల మౌళిక విశ్లేషణకు వారి అవకాశాలను పరిమితం చేసింది. దేశీయంగా, ఎగుమతులలో అధిక-విలువ మార్కెట్‌లకు సైతం వారి అవకాశాలను పరిమితం చేసింది. (Story : మెటావిజన్-8ఐని విడుదల చేసిన మెటల్ పవర్ అనలిటికల్)
