దారుణం: పట్టపగలే ఫుట్ పాత్ పై రేప్ చేశారు!
భోపాల్: దేశంలో అత్యాచారాలకు అంతులేకుండా పోయింది. సభ్య సమాజం విస్తుపోయేలా ఓ యువకుడు పట్టపగలే ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఉదయాన్నే ఫుట్‌పాత్‌పై యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నిందితులు ఆమెను ఫుట్‌పాత్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారిలో ఒక్క యువకుడు మాత్రం ఆమెను రేప్ చేసినట్లు తెలిసింది. ఉజ్జయినిలోని కోయిలా ఫటక్ సెంటర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో నిందితులు మహిళకు మత్తుమందు ఇచ్చి పట్టపగలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారం అనంతరం నిందితులు మహిళను అక్కడే వదిలి పారిపోయారు.
పెళ్లి సాకుతో నిందితులు తనను మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో వివాదాస్పదంగా మారడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెనువెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. నగరంలోని కోయిలా ఫాటక్ జంక్షన్ సమీపంలో లోకేష్ తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పెళ్లి సాకుతో లోకేష్ ఆమెకు మద్యం తాగించి బహిరంగంగా అత్యాచారం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన ఉజ్జయిని నియోజకవర్గానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, ఘాటు విమర్శలు చేస్తున్నాయి. (Story: దారుణం: పట్టపగలే ఫుట్ పాత్ పై రేప్ చేశారు!)
See Also:
బెజవాడలో మళ్లీ పెరిగిన వరద!
మీకు వెన్నునొప్పి, మెడ నొప్పి ఉందా? వాటికి కారణం ఇదే!
డెంగ్యూను అడ్డుకోవచ్చు…ఎలా అంటే? ఓ కన్నేయండి!
విజయవాడ వరదలు: బుడమేరు ఏరియల్ వ్యూ (ప్రస్తుత పరిస్థితి) l Full Video l Vijayawada Floods