క్రీడలతోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.. ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):క్రీడలతోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్సీ గుండు మల తిప్పేస్వామి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని మడకశిర పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సంబరాల జిల్లా స్థాయి టీచర్స్ సెటిల్, బ్యాట్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్ టోర్నమెంట్, పరుగు పందాలను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యుటిఎఫ్ సర్మోత్సవాల సంబరాలు సందర్భంగా ఇటువంటి క్రీడలను నిర్వహించుట నిజంగా అభినందనీయమని తెలిపారు. ఉద్యోగుల్లో క్రీడాస్థాయిని పెంపొందించుటకు ఇటువంటి సందర్భాలు రావడం మంచి తరుణమని తెలిపారు. యుటిఎఫ్ చేస్తున్న పోరాటాలు ఎంతో మంచి గుర్తింపును తెచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి సుధాకర్, జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.(Story:క్రీడలతోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.. ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి.)