రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి:ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెడతారా అని అన్నారు. తొమ్మిది నెలలుగా పనులు నిలిచిపోయిన అని అన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ సీఎంగా ఉన్నా 9 నెలలలో ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదుఅని అన్నారు.
సాగునీటి శాఖా మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు , ఈ ఏడాది జూరాలకు భారీ వరద అని అన్నారు. అత్యధికంగా 3.88 లక్షల ఇన్ ఫ్లో అని అన్నారు. 50 రోజులలో 732 టీఎంసీల వరదఅని అన్నారు. ఇక్కడ వడిసిపట్టింది 22 టీఎంసీలు మాత్రమే .. శ్రీశైలం, సాగర్ తర్వాత మిగతావన్నీ సముద్రం పాలుఅని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన రిజర్వాయర్లను ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారుఅని అన్నారు. 3.50 లక్షల ఆయకట్టుకు కేవలం 3.90 టీఎంసీల ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను మాత్రమే నిర్మించారు .. అప్పటికే ఉన్న సింగోటం చెరువును దీనికోసం వినియోగిస్తున్నారుఅని అన్నారు.
అప్పట్లోనే రిజర్వాయర్లు నిర్మించి ఉంటే భారీ వరదలు వచ్చిన ఇలాంటి సమయంలో నీళ్లు నింపుకునే అవకాశం ఉండేదిఅని అన్నారు.
కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్ 8.51, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 15.34, ఉదండాపూర్ 16.03 టీఎంసీల సామర్ద్యం గల రిజర్వాయర్లను రికార్డు సమయంలో కోర్టు కేసులు, ఏపీ కుట్రలు, కాంగ్రెస్ కుట్రలను చేధించి నిర్మించారుఅని అన్నారు. ఎన్నికలకు ముందే నార్లాపూర్ లో ఒక పంపును కూడా ప్రారంభించారుఅని అన్నారు. గత 9 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని మిగిలిపోయిన అరకొర పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది వట్టెం రిజర్వాయర్ వరకు అయినా ఏదుల రిజర్వాయర్ వరకు అయినా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదిఅని అన్నారు.
అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారుఅని అన్నారు.
ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం పంప్ హౌస్ వరదలకు నీట మునిగిందిఅని అన్నారు. వరుణుడి దయ వల్ల ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చి చెరువులు, కుంటలు నీట మునిగాయిఅని అన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా కృష్ణాలో నీళ్లున్నా రిజర్వాయర్లను నింపుకునే పరిస్థితి లేదు అని అన్నారు. (Story : రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి)