Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చేనేత జౌళిశాఖమంత్రి  చేనేత కార్మికులకు క్షమాపణ చెప్పాలి

చేనేత జౌళిశాఖమంత్రి  చేనేత కార్మికులకు క్షమాపణ చెప్పాలి

0

చేనేత జౌళిశాఖమంత్రి  చేనేత కార్మికులకు క్షమాపణ చెప్పాలి

ఏపీ చేనేత కార్మిక సంఘం, సిఐటియు డిమాండ్

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  ఏపీ చేనేత జోలి శాఖామంత్రి సవిత చేనేత కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఏపీ చేనేత కార్మిక సంఘం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సి ఐ టి యు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం
ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి , పెద్దన్న ,సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ ,సి ఐ టి యు మండల కో కన్వీనర్స్ అయుబ్ ఖాన్, ఆదినారాయణ. మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మాత్యులు శ్రీమతి సవిత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకొని వారి అవసరాలను వారి ఇబ్బందులను తొలగించే విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలి కానీ.
మంత్రి ఆ విధంగా కాకుండా వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి బాలకృష్ణ తో. చేనేత కార్మికులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మద్యం సేవించడానికి ఖర్చు పెడుతున్నారని కార్మికులను అవమానపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భవిష్యత్తులో కార్మికుల గురించి ఏ మంత్రి అయినా ఇలాంటి వాక్యాలు చేయకుండా ఉండాలంటే తక్షణమే టెక్స్ టైల్స్ & హ్యాండ్లూమ్ మంత్రిగా ఉన్నటువంటి సవిత కార్మికులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా
కార్మికులకు అవసరమైన సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం చేశారు. భవిష్యత్తులో కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులను కలుపుకొని ఏపీ చేనేత కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. (Story : చేనేత జౌళిశాఖమంత్రి  చేనేత కార్మికులకు క్షమాపణ చెప్పాలి..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version