వినుకొండలో సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలో విజయవాడ కృష్ణానది వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాడు విజయవాడ లో గత వారం రోజులుగా వరదల వల్ల నష్టపోయిన బాధితుల కొరకు నేటికీ వారి స్వగృహములకు వెళ్లి నివసించలేని దుస్థితిలో ఉన్న పేద ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేని yనిరాశ్రయులు, బాధిత శిబిరాలలో నేటికీ నివసిస్తున్న కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు శుక్రవారం వినుకొండ పట్టణంలో సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రు.20,500 రూపాయలు విరాళాలు సేకరించి పంపినట్లుగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఎ. పవన్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సోమవరపు దావీదు, సిపిఐ నాయకులు కొప్పరపు మల్లికార్జునరావు, సోడాల సాంబయ్య, షేక్ మస్తాన్, రవణమ్మ, వెంకటలక్ష్మి, దానమ్మ, తదితరులు పాల్గొన్నారు. (Story :వినుకొండలో సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ)