విశ్వ సాయి జూనియర్ కళాశాలలో గురువందన
న్యూస్‌తెలుగు/ వినుకొండ : విద్యార్థుల ఉన్నతిని తమ ఉన్నతిగాభావించే నిస్వార్థ శ్రామికులు, విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టేందుకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పించే గురువులందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వ సాయి జూనియర్ కళాశాల అధ్యాపకులకు విద్యార్థుల తరఫున మరియు కళాశాల యాజమాన్యం తరఫున సత్కరించి గౌరవించటం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులు గురువుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావనీల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల సీనియర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ పోక హనుమంతరావు, మ్యాథమెటిక్స్ విభాగం సీనియర్ అధ్యాపకులు బి.రాఘవేంద్రరావు, కమ్మ ప్రసాదు, శ్రీనివాసరావు, భారతి దేవి, కుమారి హఫీజాలను, ఫిజిక్స్ విభాగం సీనియర్ అధ్యాపకులు కే.రామారావు, డి. హర్షవర్ధన్, శ్రావణీ, కెమిస్ట్రీ విభాగం ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావని, వలి, సుకుమార్ లను, బయాలజీ విభాగం డి.సుహాసినీలను, సంస్కృత ఉపన్యాసకులు అరికిరాల కిరణ్ కుమార్, పురాణం రామమూర్తి, ఉర్దూ ఉపన్యాసకులు పి.హుసేన్ ఖాన్ ని, ఆర్ట్స్ విభాగ అధ్యాపకులు సుబ్బారావు, తాతా సాయి, కుమారి మానసలను, వైస్ ప్రిన్సిపాల్ టి.వెంకటరావు, కుమారి సలోమీలను మరియు కార్యాలయ సిబ్బంది వేలమూరి నాగలక్ష్మి, ఇతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : విశ్వ సాయి జూనియర్ కళాశాలలో గురువందన)