అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్లకు మెరుగ్గా వైద్యం అందించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
టిపా స్కానింగ్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి
న్యూస్ తెలుగు /ములుగు : అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల కు మెరుగ్గా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర
టి.ఎస్. తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలు, నేషనల్ హెల్త్ మిషన్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించారు. ముందుగా వర్షాకాలం కొనసాగుతున్నందున
ఈ కాలంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన కార్యక్రమం పైన సంబంధిత ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ నీ ప్రస్తుత డెంగ్యూ కేసులు మలేరియా కేసులు ఎక్కడ నమోదవుతున్నాయి వాటిని ఏ విధంగా పర్య వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నవి ఇకముందు ఏవిధంగా కార్యాచరణ తయారు చేసుకుంటున్నారని సమీక్షించగా, జిల్లాలో ప్రతి గ్రామంలో ఆశా ద్వారా అవగాహన కార్యక్రమం ఇంటింటి లార్వా సర్వే వైద్యాధికారుల మెడికల్ క్యాంప్స్ గ్రామపంచాయతీలచే సానిటేషన్ యాక్టివిటీ చేస్తున్నామని ప్రోగ్రాం ఆఫీసర్ తెలిపారు.
నేషనల్ ప్రోగ్రాం అయిన అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ ని షుగర్ బీపీ క్యాన్సర్ పాలియేటివ్ కేర్ ఎల్డర్లికేర్ కార్యక్రమాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాలో 16 వేల మంది బీపీ మందులు వాడుతున్నట్టు 4000 మంది షుగర్ మాత్రలు వాడుతున్నట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ వివరించడం జరిగింది. ఇతర ప్రోగ్రామ్స్ అయినా మాత శిశు సంరక్షణ కార్యక్రమం,పిల్లల టీకా కార్యక్రమాలను కూడా సంబంధిత ప్రోగ్రాం ఆఫీసర్ లైన డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ రణధీర్లను కలెక్టర్ సమీక్షించడం జరిగింది.
డి ఎం అండ్ హెచ్ ఓ అన్ని ప్రోగ్రామ్స్ పైన వివరంగా కలెక్టర్ కు తెలియపర్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యాధి ఏ ప్రాంతంలో ఎక్కువగా నమోదవుతుంది దానికి గల కారణాలను విశ్లేషించాల్సిందిగా రిపోర్ట్స్ సంబంధిత వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ విధులకు సక్రమంగా హాజరవుతూ ప్రజలతో మంచిగా ప్రవర్తించాలని సూచించారు.
ఈ సమావేశం లో డి ఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విపిన్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ రణధీర్, డాక్టర్ భవ్యశ్రీ లు పాల్గొన్నారు. (Story : అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్లకు మెరుగ్గా వైద్యం అందించాలి)