Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గంజాయి, నాటు సారా నియంత్రణ‌కు ప్రతిష్టమైన చర్యలు

గంజాయి, నాటు సారా నియంత్రణ‌కు ప్రతిష్టమైన చర్యలు

0

గంజాయి, నాటు సారా నియంత్రణ‌కు ప్రతిష్టమైన చర్యలు

న్యూస్ తెలుగు /సాలూరు :  గంజాయి మద్యం( నాటు సారా) నియంత్రించేందుకు ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి అన్నారు. బుధవారం
సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రొబేషనరీ ఎస్సైలుకు నిర్వర్తించాల్సిన విధులపట్ల దిశా నిర్దేశం చేశారు
.అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రొబేషనరీ ఎస్సైలు తరుచూ గ్రామాలను సందర్శించాలని, ముఖ్యంగా ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలను సందర్శించాలని, అక్కడ ప్రజలతో సమావేశం అయ్యి వారితో మమేకమై వారికీ సైబర్, నక్షలిజమ్/మత్తుపదార్దాల/నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలు గరించి అవగాహన కల్పించాలన్నారు. ROP/కూంబింగ్ ఆపరేషన్ లు గురించితెలుసుకొని,నిర్వహించాలని, చుట్టూ పక్కల ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలలో సంచరించే దళాల గురించి, వారికీ సహయం చేసేవారి గురించి వివరాలు, మునుపటిగా జరిగిన సంఘటనలు గూర్చి తెలుసుకోవాలన్నారు. స్టేషన్ కి న్యాయం దక్కుతుందని ఆశతో పిర్యదుదారులు వస్తారని,వారితో సామరస్యంగా మెలిగి వారి సమష్యలును పరిష్కరించాలని,నాఖబంది విధులు ఇతర స్టేషన్ విధుల గురించి క్షుణ్ణంగా ఈ ప్రాక్టికల్ శిక్షణ కాలమందు నేర్చుకోవాలని తెలియజేసారు. అదేవిధంగా స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఫిర్యాదుదారులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకొని,వారి సమష్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆయన ఆదేశించారు.అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిది హైవే దగ్గరలో గల చిన్న చిన్న రహదారులుమాతుమూరు,అలూరు గ్రామాల రహదారుల గుండా ఒరిస్సా నుండి,ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని,అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, సాలూరు రూరల్ సర్కిల్ సిఐ రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, ప్రొబేషనరీ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. (Story : గంజాయి, నాటు సారా నియంత్రణ‌కు ప్రతిష్టమైన చర్యలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version