ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్
రాబోవు రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డిఎస్పి ములుగు ఎన్ రవీందర్
న్యూస్‌తెలుగు/ ములుగు జిల్లా :
గత కొద్ది రోజులుగా కురుస్తున్న, భారీ వర్షాల నేపథ్యంలో, మరో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ ,వాతావరణ శాఖ జారీ చేసారిని అని,ములుగు డి ఎస్పీ ఎన్ రవీందర్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా డి ఎస్పీ రవీందర్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.భారీ వర్షపాతం నమోదయ్య అవకాశాలు ఉన్నాయని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని,ఎట్టి పరిస్థితుల్లో వాగులలో రిజర్వాయర్లలో చేపల వేటకు వెళ్లకూడదని, వాగులు దాటే ప్రయత్నం అసలు చేయకూడదన్నారు.ఆకస్మికంగా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని ,భారీ వర్ష సూచన కారణంగా,పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పశువుల కాపరులు అడవులలోకి వెళ్లకూడదని తెలిపారు.తడిదనం వల్ల విద్యుత్ ఘాతానికి లోనయ్యే అవకాశం ఉన్నందున, విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదని, శిధిలావస్థలో ఉన్న నివాసాలలో ఉంటున్న వారు, వెంటనే ఖాళీ చేసి తమ బంధువుల ఇల్లలోకి గాని,రక్షణ శిబిరాలలోకి గాని వెళ్లాలని డిఎస్పీ తెలియజేశారు. (Story : ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్ )