మన వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ గారే
న్యూస్‌తెలుగు/వినుకొండ : విప్లవాల పురిటి గడ్డ కు. నూతనంగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. వినుకొండలో తుఫాను కారణంగా పలు ప్రాంతాలు పర్యటించి సహాయక చర్యలు చేపట్టి పట్టణ శివారు కాలనీలో పర్యటించి పేద కుటుంబాలకు భరోసా కల్పించి ఆదుకున్న సుభాష్ చంద్రబోస్ కు . విజయవాడ వరద విపత్తు. పై ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో హుటాహుటిన విజయవాడ వెళ్లి కృష్ణలంక తదితర ముంపుకు గురైన పలు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడుతున్న వినకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను పలువురు అభినందిస్తున్నారు. వీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తూ వినకొండ బదిలీపై వచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సుభాష్ చంద్రబోస్ విధులు నిర్వహించిన అనుభవం ఉన్న కారణంగా సుభాష్ చంద్రబోస్ ను విజయవాడ వరద విపత్తుపై విజయవాడకు పిలిపించారు. (Story : మన వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ గారే)