ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టుల నమోదుకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : ఇన్స్పైర్ మనక్ వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ఉన్నత పాఠశాలల నుంచి ఐదు ప్రాజెక్టులు చొప్పున ఆన్లైన్లో నమోదు చేయాలి. భారత శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ,పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం.విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు వెలికి తీయుటకు, సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించుటకు, నూతన ఆలోచనలతో ప్రాజెక్టు రూపకల్పన చేయుటకు విద్యార్థులను ప్రోత్సహించాలి. ఎన్నిక కాబడిన ప్రతి ప్రాజెక్టుకు పదివేల రూపాయలు బహుమతిగా మంజూరు చేయబడును.ఉపాధ్యాయులు అందరూ ఇన్స్పైర్ ప్రాజెక్టులను నమోదు చేయవలసిందిగా కారడమైనది.నేటి వరకు జిల్లాలో గల 200 పాఠశాలల నుంచి 850 ప్రాజెక్టులు నమోదు చేయడం జరిగినది. ప్రాజెక్టుల నమోదుకు చివరి తేదీ ఈ నెల 15 .
చివరి వరకు వేచి ఉండగా ఉపాధ్యాయులు త్వరపడవలసిందిగా కోరడమైనది.ఈ పొస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నవారు యం.కృష్ణారావు,జిల్లా సైన్స్ అధికారి. ఎన్ టి నాయుడు, ప్రిన్సిపల్, డైట్ కళాశాల, శేఖర్ ఏ. ఎస్. ఓ. శ్రీనివాస్,ఏ. డి, సుపరెండెంట్లు, సమగ్ర శిక్ష సిబ్బంది తదితరులు పాల్గోన్నారు. (story : ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టుల నమోదుకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ)