డా.రాఘవులును పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తిః విమోచన హాస్పిటల్ ఎం.డి.డాక్టర్.రాఘవులు గారి సతీమణి శ్రీమతి మరియమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి మరియమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి శ్రద్ధాంజలి తెలిపారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి ధైర్యంగా ఉండాలి అని అన్నారు.నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ఉంగ్లమ్మ్ తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, స్టార్ రహీమ్, పరంజ్యోతి, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, తోట శ్రీను తదితరులు ఉన్నారు. (Story: డా.రాఘవులును పరామర్శించిన మాజీ మంత్రి)