అమ్మవారి దేవాలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమం
న్యూస్‌తెలుగు/విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలు వనంగుడి, చదురు దేవాలయాల వద్ద పోలాల అమావాస్య, మంగళవారం కావడంతో భక్తులుపోటెత్తారు. వనంగుడిలో దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం శాంతి హోమం, పూర్ణాహుతినిర్వహించారు. వేదపండితులు సాయికిరణ్ శర్మ, తాతా రాజేష్ శర్మలు వేదపారాయణలు చేసారు. చదురుగుడి లలో పైడితల్లి అమ్మవారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకాలు ఆలయ అర్చకులు ఏడిద వెంకటరమణ, పూజారి బంటుపల్లి వెంకట్రావు ,ధనుంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రత్యేక అలంకరణ లు చేసారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అమ్మవారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లును భక్తులకు దేవస్థానం అధికారులు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సీనియర్ అసిస్టెంట్లు ఏడుకొండలు మణికంఠ చర్యలు చేపట్టారు. మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. (Story: అమ్మవారి దేవాలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమం)