ధరల అదుపులో కేంద్రం వైఫల్యం
వరద బాధితులకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలి
న్యూస్‌తెలుగు/వినుకొండ: దేశంలో పెరిగిన అధిక ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని పెరిగిన అధిక ధరలను తగ్గించాలని, వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలో మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధరల పెరుగుదలను అరికట్టాలని పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ లో బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన కేంద్రం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని ప్రజలను నమ్మబలికిందని కానీ రాష్ట్రంలోనూ దేశంలోనూ పెరిగిన ధరలు తగ్గించకపోగా ధరల భారాలు పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారని గత పది సంవత్సరాలుగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ధరాభారాలతో సామాన్యుడు కొనుగోలు శక్తి పడిపోయిందని ప్రజలు కొనుగోలు చేసే సరుకులు, వస్తువులపై 200, 300 శాతం పైబడి ధరలు పెరిగిపోయాయని సామాన్యుడి కుటుంబాలు జీవించే పరిస్థితులు కను మరుగుతున్నాయని జిడిపి పడిపోయి దేశం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో బిజెపి హటావో దేశ్ కి బచావో నినాదంతో దేశంలో భారతీయ జనతా పార్టీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగుతున్నాయని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు దేశంలో బిజెపిని తిరస్కరించారని ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బిజెపి అధికారాన్ని కొనసాగిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల వరదల వల్ల ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోయారని జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి కేంద్రం వెంటనే సహాయంగా 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం ఇటీవల కురిసిన వర్షాలు వల్ల తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయ అధికారులు పంట నష్టాలను వెంటనే అంచనా వేసి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని, విజయవాడ నగరంలో వరదల వల్ల ప్రవాహం లో మునిగిపోయి న గృహాల వారికి తక్షణ సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో నష్టపోయిన రైతన్న ను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆర్. వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎ. పవన్ కుమార్, షేక్ కిషోర్, కే. మల్లికార్జున, సాంబయ్య, సోమవరపు దావీదు, ధూపాటి మార్కు, పి.వెంకట వెంకటేశ్వర్లు, యూనిస్, రాములమ్మ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story: ధరల అదుపులో కేంద్రం వైఫల్యం)