తమ్మిలేరు వరద ఉధృతి
శివాపురం చిన్నంపేట కాజ్వే వద్ద రాకపోకలు బంద్
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ పరిశీలన
న్యూస్‌తెలుగు/చాట్రాయి : సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది చిన్నంపేట శివాపురం కాజ్వే వద్ద రాకపోకలు నిలిపివేశారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన తమ్మిలేరుకు ఎగుప్రాంతం నుండి వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం సాయంత్రం చాట్రాయి మండలం చిన్నంపేట చింతలపూడి మండలం శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరు పై ఉన్న కాజ్వే నీట మునిగింది. చాట్రాయి తాసిల్దార్ డి ప్రశాంతి రాకపోకలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రెండు వైపుల నుండి రెవిన్యూ పోలీస్ సిబ్బంది కాపలా కాస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ ఆదివారం సాయంత్రం శివపురం గ్రామానికి వచ్చి తమ్మిలేరు కాజ్వేవద్ద పరిస్థితిని పరిశీలించారు.
మర్లపాలెం పాత హరిజనవాడలో మద్దాల యేసు ఇల్లు గోడలు కూలిపోయాయి. మర్లపాలెం ఉప సర్పంచ్ వెల్ది రాజారావు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు అప్పారావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మండల లో అనేక గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఏ క్షణంలో ఏం జరుగుతోనని ప్రజలు భయకంపితులు అవుతున్నారు. (Story : తమ్మిలేరు వరద ఉధృతి)