UA-35385725-1 UA-35385725-1

కొచ్చిలో టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కొత్త రిటైల్‌ స్టోర్‌లు

కొచ్చిలో టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కొత్త రిటైల్‌ స్టోర్‌లు

న్యూస్‌తెలుగు/ కొచ్చి: భారతదేశ ఈవీ విప్లవానికి మార్గదర్శకుడు, టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (టీపీఈఎం) తాజాగా కేరళలోని కొచ్చిలో టాటా.ఈవీ బ్రాండ్‌ గుర్తింపు క్రింద రెండు ఈవీ-ప్రత్యేకమైన రిటైల్‌ స్టోర్‌లను ఎడపల్లి, కలమస్సేరిలో ప్రారంభించింది. ఇవి ఈవీ కమ్యూనిటీకి సాంప్రదాయ కార్ల విక్రయాలకు మించి ప్రత్యేకమైన, ఉన్నతమైన కొనుగోలు, యాజమాన్య అనుభవాన్ని రెండిరటిని అందిస్తాయి. కస్టమర్‌ కొనుగోలు విధానాల్లో వస్తున్న అధునాతన మార్పులతో, దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు కూడా పెరుగుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీలు) కోసం కస్టమర్‌లు బ్రాండ్‌ ఉత్పత్తి నుండి యాజమాన్యం వరకు విలక్షణమైన అనుభవాన్ని కోరుకుంటున్నారు. కస్టమర్‌ నుండి వచ్చిన ఈ అభ్యర్థనకు కొత్త వినియోగదారు-ఫేసింగ్‌ బ్రాండ్‌ గుర్తింపు సమాధానం ఇస్తుంది. ప్రధానంగా కమ్యూనిటీ, సాంకేతికత, సుస్థిరత వంటి అంశాల ద్వారా నడిచే మొబిలిటీ భవిష్యత్తు పట్ల తన నిబద్దతను బలపరుస్తుంది. ఈ విలువలకు భౌతిక ప్రాతినిధ్యంగా, టాటా.ఈవీ స్టోర్‌లు, ఈవీ కొనుగోలుదారుల విభిన్న అంచనాలను పరిగణిస్తాయి. (Story : కొచ్చిలో టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కొత్త రిటైల్‌ స్టోర్‌లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1