Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఏపీకి ప‌ర్యాట‌క శోభ!

ఏపీకి ప‌ర్యాట‌క శోభ!

0

ఏపీకి ప‌ర్యాట‌క శోభ!

సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతం పిచ్చుకలంక

రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం అభివృద్ధి చేస్తాం.

 పిచ్చుకులంక  అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో చర్చించిన..

మంత్రి.. కందుల దుర్గేష్

న్యూస్‌తెలుగు/ ఆత్రేయపురం : సహజ సిద్ద ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంక లో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

సోమవారం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఆర్ శంకర్, నవీన్ గోస్వామి, మాలూన్ తానేజ్ పాల్గొన్నారు.

సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఓబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పిచ్చుకలంక గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలకు రావడం జరిగిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తోను, పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధిపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ సందర్భముగా ఓబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు ఇప్పటికే గండికోట, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వామ్లవుతామని వారు పేర్కొన్నట్లు తెలిపారు. ఆ సందర్భంలో రాజమండ్రి వద్ద పిచ్చుకలంక గ్రామంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రకృతి సంపద ఉందని ఈ ప్రాంతాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని వారికి చెప్పడం జరిగిందన్నారు. ఆ మేరకు ఓబెరాయ్ హోటల్స్ ప్రతినిధి బృందం నేడు పిచ్చుకల్లంక గ్రామాన్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
ఓబెరాయ్ హోటల్స్ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పిచ్చుకల్లంక పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి, బండారు సత్యానందం, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వివరించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి టూరిజాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలోని దేవాలయాలు వచ్చే యాత్రికులు అన్నవరం సత్యనారాయణ స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి, ధవలేశ్వరంలో లక్ష్మి జనార్ధన స్వామి, అంతర్వేది,కోరుకొండలలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలు టెంపుల్ టూరిజం గా ఉన్నాయని పేర్కొన్నారు.

మారేడుమిల్లి వంటి ప్రాంతంలో పర్యావరణానికి హితమైన ఇకో టూరిజం, రాజమహేంద్రవరంలో గోదావరి తీరం, డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేరళ ను తలపించే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా రెండు మూడు రోజులు ఉండే విధంగా గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలను పర్యాటక రంగ అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కడియం నర్సరీ ఆసియాలోనే ద్వితీయ స్థానాన్ని ఏర్పరచుకుందని, దాన్ని అభివృద్ధి చేసే దిశగా కెనాల్ బోట్ షికార్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఒబెరాయ్ సంస్థ వారు భాగస్వాములు అవుతారని వారికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా నేను అన్ని విధాల సంపూర్ణ సహకారాన్ని అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుక లంక ప్రాంతంలో ఉత్తర వైపుగా ఉన్న 56 ఎకరాలు స్థలాన్ని పర్యా టకంగా అభివృద్ధికి ఎంపిక చేయడం తెలిపారు. గ్రూప్ సభ్యులు ఎయిర్పోర్ట్ నుండి అన్ని మార్గాల ద్వారా స్థానికంగా చేరుకోవచ్చు అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం నగరాల నుండి చేరుకోవడానికి గల మార్గాలు సమయాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారన్నారు. అధికారులు గ్రూప్ సభ్యులు కోరిన సమాచారాన్ని సంపూర్ణంగా విపులంగా వివరిస్తూ వ్రాతపతులను సమర్పించారన్నారు. అదేవిధంగా ఛాయాచిత్ర ప్రదర్శన మ్యాపులు ద్వారా సభ్యులకు ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు వరద సమయాలలో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందన్న అంశాలపై కూడా అవగాహన పెంపొందించామన్నారు.

స్థానిక శాసనస భ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ పిచ్చుక లంక ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిది ద్దేందుకు గ్రూప్ సభ్యులు క్షేత్ర పరిశీలనకురావడం అభినందనీయమన్నారు పర్యాటక హబ్ ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేం దుకు అవకాశాలు నిండుగా ఉన్నాయని తెలిపారు. ఔషధ మొక్కలు పెంపకానికి ఈ ప్రాంతం ఎంతో అనువై నదని అదేవిధంగా ఆహ్లాదకర వాతావరణం లో బోటి షికారు నిర్వహించడానికి అనువుగా ఉంటుంద న్నారు. కేరళకు మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని తెలిపారు. మంచి ఎంటర్టైన్మెంట్ అవకాశం స్థానిక ప్రజానీ కానికి పిచ్చుకలంక ప్రాంత అభివృద్ధి ద్వారా లభించనున్నదన్నారు అన్ని అవకాశాలను మేళవించి మంచి టూరిజం ప్యాకేజీ ను తీసుకురావాలని ఆయన గ్రూప్ సభ్యులకు విన్నవించారు.

శాసనస భ్యులు గోరంట్ల బుచ్చ య్య చౌదరి మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి మూలంగా  స్థానికంగా ఉన్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ నున్నాయన్నారు.పిచ్చుకలంక సుందరమైన ప్రాంతమని తెలిపారు. రాజమహేం ద్రవరంలో హేవలాకు బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. కడియపులంక  ప్రాంతం బోట్ షికారుకు అనువైనద న్నారు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మరోపక్క రిసార్ట్స్ ఏర్పాటు చేసి కడియపు లంక నర్సరీల ప్రభావాన్ని చాటి చెప్పే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయ న్నారు  ప్రాచీన దేవాలయాల సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన పుణ్య క్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతోoదన్నారు. మానవ సమాజం సాంఘి కంగా సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటన్నారు. రవాణా రంగం తో పాటుగా ఉపాధి అవ కాశాలు కల్పనలో పర్యా టక రంగం అధిక ప్రాధాన్య త కలిగి ఉందన్నారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పన చేసి అమలు చేస్తుందని వాటిలో పిచ్చుకలంక పర్యాటక కేంద్రం ఒకటన్నారు ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగ పడుతుందన్నారు. అదేవిధంగా ఉపాధికల్పన పెరుగుదలతో పాటు సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుందన్నారు. పర్యాటక ప్రాజెక్టుల వల్ల పర్యాటక రంగ అభివృద్ధితోపాటుగా ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతా యన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మరియు శాసనసభ్యులు బండారు సత్యానందరావు  లాకుల స్థితిగతులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఓబరాయి గ్రూపు వైస్ చైర్మన్ ఆర్ శంకర్, నవీన్ గోస్వామి తినేజ, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి. స్వామి నాయుడు, జిల్లా పర్యాటక అభివృద్ధికారి పి.వెంకటాచలం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి ఎస్ వి వి సత్యనారాయణ, స్థానిక నాయకులు బండారు శ్రీనివాసరావు  తదితరులు పాల్గొన్నారు. (Story : ఏపీకి ప‌ర్యాట‌క శోభ!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version