శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయాలి
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ఐదు వేల ఎకరాల సాగు భూమిని బీడు భూములు కాకుండా కూటమి ప్రభుత్వం ఆయకట్టు రైతులును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. శివాపురం ఎత్తిపోతల పథకం మరమ్మతులు వెంటనే చేయాలని. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని .మాట్లాడుతూ శివాపురం ఎత్తిపోతల పథకం మరమ్మతులు వెంటనే కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే మరమ్మతులు చేయిస్తే శివాపురం .భారతపురం పానకాలపాలెం , శ్రీరామ్ నగర్, తిమ్మాయపాలెం ,
చీకటి గల పాలెం, ఈ పంచాయతీల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు సాగు భూములు బీడు భూములుగా మారకుండా కూటమి ప్రభుత్వం చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు కొన్ని వరదల్లో కొట్టుకుపోవడం కొన్ని రిపేర్లు ఉండటం వల్ల పల్నాడు జిల్లాలో సుమారు 1,50,000 ఎకరాల భూములు గత ఐదు ఏళ్ళుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై సాగు భూములు బీడు భూములుగా మారాయి.వర్షాలు పడక ఈ భూములు నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో లేకపోవడం వలన ఈ భూములు గుండ్లకమ్మ కృష్ణా నది పైన ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఉండటంవల్ల ఈ ఏడాది పల్నాడు జిల్లాలో సరైన వర్షాలు పడకపోవడంతో వర్షాధారంపైన ఆధారపడి వేసే పంటలు కూడా ఇప్పటికీ రైతులు భూములు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు వర్షాలు పడకపోగా వేసవి కాలంలో ఎంత ఎండలు కాస్తాయో అంత ఎండలు ఈ సీజన్లో కాయడంతో రైతులు అధైర్య పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొని రైతుల్ని ఆదుకోవాలని . పైన తెలిపిన అన్ని సమస్యలు పరిష్కరించాలని.రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము.కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు
పి న్నెబోయిన వెంకటేశ్వర్లు, రైతు నాయకులు
కానాలఅంజిరెడ్డి , మూసిరిక వెంకటేశ్వర్ రెడ్డి, కమతం వెంకటేశ్వర రెడ్డి , ములక పెద్ద ఎలమంద రెడ్డి , ఆళ్ల నాగిరెడ్డి , పాపిరెడ్డి , మాలం కొండారెడ్డి ఆవుల మంద బ్రహ్మయ్య , బొజ్జ కోటిరెడ్డి ,ఈశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి, కమతం లక్ష్మిరెడ్డి , మస్తాన్ లక్ష్మి , రమాదేవి, ప్రమీల అనేకమంది రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story : శివాపురం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయాలి)