UA-35385725-1 UA-35385725-1

గ్రోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ గేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యకరం

గ్రోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ గేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యకరం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: దేశం మొత్తం సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో 42%తో మిరప పంటలు దేశ ఆర్థిక వ్యవస్థలో, రైతుల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ, విజయవంతమైన మిరప సాగు పునాది ఆరోగ్యకరమైన మొలకల మీద ఆధారపడి ఉంటుంది, ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్పిడికి దారితీస్తుంది.‘‘మిరప పరిశ్రమలో, విజయం అనేది నారు నాణ్యతతో ప్రారంభమవుతుంది. గ్రేషియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయి, నర్సరీ యజమానులకు మరింత వ్యాపారం జరిగేందుకు ఇది తోడ్పడుతుంది, ఎందుకంటే రైతులు వారి నుండి కొనుగోలు చేస్తారు’’ అని గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ బిజినెస్‌ సిఇఒ రాజవేలు ఎన్‌కె అన్నారు. గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ గ్రేసియా ఆరోగ్యకరమైన నారు పెంపకంలో చురుకైన విధానాన్ని అందిస్తుందని, సరైన సమయంలో, సరైన పరిమాణంలో గ్రేసియాను వినియోగించటం ద్వారా, నర్సరీ యజమానులు ప్రధాన పొలాల్లో మెరుగైన నాట్ల కోసం ఆరోగ్యకరమైన, తెగులు లేని నారును నిర్ధారించవచ్చునని తెలిపారు. గ్రేసియా ప్రత్యేకమైన ట్రాన్స్‌లామినార్‌ చర్య, మిరప పంటలకు రెండు ప్రధాన ముప్పులు అయిన తామర పురుగు, గొంగళి పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. (Story : గ్రోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ గేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యకరం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1