ఆక్రమణలను పరిశీలించిన తహసిల్దార్
– దత్తక్షేత్రం కాలనీ లో ఆక్రమణలు
– వేటపాలెం స్ట్రైట్ కట్ ఆక్రమణ
– స్మశాన భూమి పరిశీలన
న్యూస్‌తెలుగు/వేటపాలెం: మండలంలోని చల్లారెడ్డి పాలెం పంచాయితీ దత్తక్షేత్రం కాలనీలో ఖాళీ స్థలంలోభూకబ్జాలు, వేటపాలెం స్ట్రైట్ కట్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ చేసి ఆక్రమణలను అక్రమ నిర్మాణాలను తొలగించి కల్లూరి నాగరాజుపై అతనికి సహకరించిన స్థానిక వీఆర్వో మీద క్రిమినల్, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేసిన కోరుకొండ ధనుంజయ్ మరియు స్థానిక కాలనీ వాసులు చేసిన ఫిర్యాదులపై బుధవారం సాయంత్రం వేటపాలెం తహశీసిల్దార్ శివపార్వతి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ముందుగా దత్తక్షేత్రం కాలనీలో ప్లాట్ నెంబర్ 210 ప్లాట్ నెంబర్ 89 ప్లాట్ నెంబర్ 11 ప్రక్కన ఆక్రమణలను పరిశీలించి తక్షణమే ప్రభుత్వ స్థలమని బోర్డులు ఏర్పాటు చేయాలని తహశీసిల్దార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గతంలో రుడ్ సెట్ సంస్థకు కి కేటాయించిన స్థలంలో చీరాల జర్నలిస్టులు కు కేటాయించిన పొజిషన్ పై విచారణ చేపడతామని ఫిర్యాదుదారులకు తెలిపారు. ప్లాట్ నెంబర్ 35 కు పడమర దిక్కున రోడ్డు మార్జిన్ మూడున్నర సెంట్లు ఖాళీ స్థలంలో రెండు ఫ్లోర్లు పిల్లర్స్ స్లాబ్ నిర్మాణం ను పరిశీలించారు. ప్లాట్ నెంబర్ 210 లబ్ధిదారు తన ప్లాటు పక్క ఉన్న లే అవుట్ లో లేని ఖాళీ ప్లాటు ను మరియు రోడ్డు మార్జిన్ తోపాటు ఖాళీ స్థలాన్ని కలిపి నాలుగున్నర సెంట్లు ఆక్రమణకు గురైందని స్థానికులు తహశీసిల్దార్ కి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల పరిశీలించిన తదుపరి తగు చర్యలు తీసుకుంటామని తహశీసిల్దార్ స్థానికులకు తెలిపారు. అనంతరం కల్లూరి నాగరాజు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వేటపాలెం స్ట్రైట్ కట్ పరిశీలించారు. సుమారు 60 సెంట్లు సోన పోరంబోకు భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు. తక్షణమే ఫెన్సింగ్ తొలగించి ఆక్రమణదారుపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. చేనేతపురి కాలనీలో ప్లాట్ నెంబర్ 904 కు ఇరువైపులా ఉన్న ఐదు ప్లాట్లు స్థానిక వీఆర్వో సహకారంతో చెదులు నారాయణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఉన్న ప్లాట్లను తహశీసిల్దార్ పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి తగు చర్యలు చేపడతామని ఆమె తెలిపారు.
స్మశాన భూమి కొరకు పరిశీలన
దత్తక్షేత్రం, చేనేతపురి, జగనన్న కాలనీలలో సుమారు 2500 కుటుంబాల వినియోగం కొరకు స్మశాన భూమిని కేటాయించమని జిల్లా కలెక్టర్ స్థానికులు అర్జీలు పెట్టుకున్న నేపథ్యంలో వేటపాలెం తహశీసిల్దార్ రెవెన్యూ సిబ్బందితో స్థల పరిశీలన చేశారు.తహశీల్దార్ వెంట ఇన్చార్జ్ రెవెన్యూ అధికారి కోటేశ్వరరావు, గ్రామ సర్వేయర్ తేజ, ఫిర్యాదుదారు కోరుకొండ ధనుంజయ్, రామచంద్రరావు స్థానిక చేనేత కార్మికులు ఉన్నారు. (Story : ఆక్రమణలను పరిశీలించిన తహసిల్దార్)