గుడుంబా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవు
రూ 24000. విలువ చేసే గుడుంబా పట్టివేత
ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం : గుడుంబా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవు అని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు.బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన సోదరి గంగరాజు 60 లీటర్ల గుడుంబా విలువ రూ.24000 తరలిస్తుండగా, పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.
ములుగు జిల్లా ఎస్పీ . ఏటూర్ నాగారం ఏ ఎస్పీ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ సూచనల మేరకు. ఏటూర్ నాగారం మండలంలో గుడుంబా విక్రయాలు అరికట్టడం కోసం ,గుడుంబా రహిత మండలం గా తీర్చిదిద్దడం కోసం. ముత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గుడుంబాకు. మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన . గుడుంబా విక్రయించినట్లయితే. చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : గుడుంబా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవు)