డాక్టర్ రావుల వెంకట్ రంగారెడ్డి ప్రథమ వర్ధంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : డాక్టర్ రావుల.వెంకట్ రంగారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు. రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి అన్న వెంకట్ రంగారెడ్డి గారి ప్రథమ వర్ధంతి వేడుకలు కానాయపల్లి గ్రామములో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి గారు,మాజీ ఎం.ఎల్. ఎ ఆలా.వేంకటేశ్వర రెడ్డ్డిగార్లు వెంకట్ రంగారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎం.పి రావుల వరలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వారి చెల్లెలు విజయమ్మ , వెంకట్ రంగారెడ్డి కుమారులు రావుల.కిషోర్,రావుల కిరణ్ గార్లు పలుసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేయూత ఆశ్రమంలోని 33మంది విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. చౌడేశ్వరి మాత వృద్ధాశ్రమం నిర్వాహకులు రాము గారికి ఒక నెల సరిపడ సరుకులకు 15వేల రూపాయాలు అందజేశారు.
అదేవిధంగా కానాయపల్లీ తాండాకు చెందిన బేగావత్.అంజనేయులుమనెమ్మ కూతురు గిరిజ ఇటీవల ఎం.బి.బి.ఎస్ సీటు సాధించినందుకు రావుల అభినందించి ఆమె చదువు కోసం 25వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మేస్త్రీ శ్రీను గారు మరో 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కీర్తిశేషులు వెంకట్ రంగారెడ్డి వారి అభిమానులు,స్నేహితులు, శ్రేయోభిలాషిలాషులు,రాజకీయ నాయకులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,ఎం.డి.గౌస్,వహీద్, నందిమల్ల.రమేష్,ఉంగ్లమ్. తిరుమల్ల్ తదితరులు పాల్గొన్నారు. (Story : డాక్టర్ రావుల వెంకట్ రంగారెడ్డి ప్రథమ వర్ధంతి)