Homeవార్తలుతెలంగాణర్యాగింగ్ కు పాల్పడిన ప్రోత్సహించిన చట్టప్రకారం నేరం

ర్యాగింగ్ కు పాల్పడిన ప్రోత్సహించిన చట్టప్రకారం నేరం

ర్యాగింగ్ కు పాల్పడిన ప్రోత్సహించిన చట్టప్రకారం నేరం

ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డా. శబరిష్

న్యూస్ తెలుగు /ములుగు :
ములుగు జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్ ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా తన కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలల్లో కళాశాలలో చదువుకునే పై తరగతి (సీనియర్ )విద్యార్థులు తమ క్రింది తరగతి (జూనియర్ ) విద్యార్థులను వేధించడం,దుశించడం కొట్టడం, అగౌరవపరచడం మానసికంగా, శారీరకంగా / లైంగికంగా వేదించడం అమర్యాదగా ప్రవర్తించడం,నేరపూరీత ఉద్దేశం కలిగి ఉండడం, వారిని నిరోదించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం,ఆర్థిక దోపిడి అనగా డబ్బులు లాక్కోవడం లేదా బలవంతంగా ఖర్చు పెట్టించడం వంటి చర్యలను ర్యాగింగ్ గా పరిగణించబడతాయని తెలియ చేశారు.
ర్యాగింగ్‌ కు పాల్పడే విద్యార్థి పై క్రింది చర్యలు తీసుకోబడతాయని,పాఠశాల లేదా కళాశాలలో అడ్మిషన్ రద్దు చేయబడుతుందన్నారు.
పాఠశాల / కళాశాల నుండి సస్పెండ్ చేయబడునని,
పోలీస్ విచారణకు గురి అవుతారని,నిరూపణ అయితే ర్యాగింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయాని,తద్వారా భవిష్యత్ ను తమ జీవన ప్రగతిని కోల్పోతారని, కావున ఎవరు కూడా ర్యాగింగ్ పాల్పడవద్దని,తోటి విద్యార్థులను గౌరవించి, తమ తల్లిదండ్రుల,ఆశయాలను కళలను సహకారం చేసి,ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ములుగు మహేష్ బి గితే,డీఎస్పీ ములుగు రవీందర్, ఆర్ ఐ అడ్మిన్ వెంకటనారాయణ గారు పాల్గొన్నారు. (Story : ర్యాగింగ్ కు పాల్పడిన ప్రోత్సహించిన చట్టప్రకారం నేరం.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!