Home వార్తలు తెలంగాణ రైతులకు వెంటనే 2 లక్షల రుణామాపీ చేయాలి

రైతులకు వెంటనే 2 లక్షల రుణామాపీ చేయాలి

0

రైతులకు వెంటనే 2 లక్షల రుణామాపీ చేయాలి

సునీల్ కుమార్

న్యూస్ తెలుగు /ఏటూరునాగారం : బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మినర్సింహారావు,మరియు ములుగు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, మండల కమిటీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణలోనీ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాల వేసి, తల్లి నీపట్ల ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మనించి,క్షమించి, ఎనుముల రేవంత్ రెడ్డిని సద్ బుద్దిని ప్రసాధించాలని, తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగిందని బిఆర్ఎస్ ఏటూరునాగారం మండల కమిటి అధ్యక్షులు జి. సునీల్ కుమార్ వేడుకున్నట్లు ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని హామీ, ఇచ్చి అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో ఒక మాట మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మంత్రివర్గం లోని మంత్రులు తల తోకలేని, అవగాహన రహితంతో పొంతన లేని మాటలు మాట్లాడుతూ, తెలంగాణ రైతంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 2లక్షల రుణమాఫీని ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల ఖాతాలో జమ చేయాలని, లేని పక్షంలో రైతులు పక్షాన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అందరూ రైతులకు 2 లక్షల రూపాయల మాఫీ చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. తదనంతరం ఏటూరునాగారం అగ్రికల్చర్ ఏఓ వేణుగోపాల్ కు,రుణమాపీ కానీ రైతు లకు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా,, 2లక్ష రుణ మాఫీ చేయాలి అన్ని మెమోరండం ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖాజ పాషా, సప్పిడి రామ్ నర్సయ్య, తూరం పద్మ,ఈసం రామ్మూర్తి,మాదరి రామయ్య,దన్నపునేని కిరణ్, కుమ్మరి చంద్రబాబు, బట్టు రమేష్, వావిలాల రాంబాబు, జాడి భోజరావు, కాళ్ల రామకృష్ణ, గండేపల్లి నరసయ్య, వావిలాల ముత్తయ్య, దొడ్డ కృష్ణ, చిప్ప నాగరాజు, బాసాని శేఖర్, చంద లక్ష్మీనారాయణ, పరికి వేణుగోపాల్, కాక ఫణి కుమార్, కొండ గొర్ల తిరుపతి, ఇట్టెం నాగరాజు, గారే రమేష్, గారే ఆనంద్, కత యాదగిరి, కమల, కాకులమర్రి భాస్కర్, దడిగల లక్ష్మణ్,అశోక్, దేపాక శ్రీరామ్, జాగటి లాలు, అశోకు, తదితరులు పాల్గొన్నారు. (Story : రైతులకు వెంటనే 2 లక్షల రుణామాపీ చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version